శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (09:10 IST)

సుప్రీంకోర్టు ఎదుట నిప్పంటించుకున్న మహిళ మృతి

బిఎస్‌పి ఎంపి అతుల్‌రాయ్ తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. గతవారం సుప్రీంకోర్టు ముందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మరణించారు.

తనపై ఎంపీ అతుల్‌రారు 2019లో లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఎంపి అతుల్‌రారు తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 24 ఏళ్ల బాధితురాలు.. తన స్నేహితుడితో కలిసి గతవారం సుప్రీంకోర్టు ముందు నిప్పంటించుకున్నారు.

ఆ రోజే యువకుడు చనిపోయాడు. 85 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మంగళవారం మరణించారు.