శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:23 IST)

సోదరుడితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డుగా వున్నాడని చంపేసింది..

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా వావీవరసలు మరిచిన ఓ మహిళ వివాహ బంధానికే మచ్చ తెచ్చింది. సోదరుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చింది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన యూపీలో పిలిబిత్‌ జిల్లాలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహాస్ గ్రామానికి చెందిన రామ్‌దాస్‌కు (40), నన్హి దేవికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరి ముగ్గురు సంతానం. నన్హి దేవి తనకు సోదరుడి వరుసయ్యే ఉమాస్సార్ గ్రామానికి చెందిన బన్వరీ లాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డంగా వున్నాడని.. అతని అడ్డు తొలగించాలనుకుంది. అంతే పక్కా ప్లాన్ వేసింది. 
 
సోమవారం రాత్రి రామ్‌దాస్‌ గొంతుకు నైలాన్‌ తాడు బిగించి హతమార్చి పరారయ్యారు. ఉదయం మృతుడి తండ్రి లాల్‌జీత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గజ్రౌలా-డియోరియా రహదారిపై అగ్యారీ క్రాసింగ్ వద్ద నన్హి దేవితోపాటు భన్వరీ లాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.