శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (13:16 IST)

Woman Tortures Mother: తల్లిని కొట్టింది, తన్నింది, కొరికింది.. ఆ యువతి రాక్షసినా? (Video)

Woman Tortures Mother
Woman Tortures Mother
ఆధునిక పోకడలు, స్మార్ట్ ఫోన్ యుగం మనుషులను మార్చేస్తోంది. మానవీయ బంధాలు రోజు రోజుకీ మంటగలిసిపోతున్నాయి. తల్లిదండ్రులపై ఆప్యాయత చూపే వారి సంఖ్య తగ్గుతున్నారు. తల్లిదండ్రులను పోషించడం భారంగా భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వారి వయోభారం సమయంలో అండగా నిల్చేందుకు వెనుకాడుతున్నారు. ఇంకా తల్లిదండ్రులను ఆశ్రమంలో చేర్చేస్తున్నారు. 
 
తాజాగా ఓ తల్లిపై కుమార్తె హింసించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కన్నతల్లిని దారుణంగా హింసించిన కుమార్తెపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు.  హర్యానాకు చెందిన ఓ యువతి తల్లిని చిత్రహింసలు పెట్టింది. చేతులతో కొట్టి, కాళితో తన్ని, నోటితో కొరికి, గోడకేసి కొట్టింది. ఆ తల్లి ఎంత వేడుకున్నా వదల్లేదు. కొట్టడం ఆపకుండా ఆమెను చిత్ర హింసలకు గురిచేసింది. 
Woman Tortures Mother
Woman Tortures Mother
 
తల్లిపై అసభ్య పదజాలంతో తిట్లు తిట్టింది. ఇక ఆ తల్లి ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆ యువతి కూతురా లేకుంటే రాక్షసినా అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.