శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (17:16 IST)

పట్టాలు తప్పిన చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు 12 బోగీలు - నలుగురి మృతి

derail
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన 12 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ప్రమాద తెలియగానే సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. అలాగే ప్రమాద వివరాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధింత రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. చండీగఢ్ - డిబ్రూగఢ్ ఎక్స‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పగా, వీటిలో రెండు ఏసీ బోగీలు కూడా ఉన్నాయి. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్‌లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకునేందుకు ఈస్టర్న్ రైల్వే హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను ప్రకటించింది. 
 
- Commercial Control: 9957555984
- Furkating (FKG): 9957555966
- Mariani (MXN): 6001882410
- Simalguri (SLGR): 8789543798
- Tinsukia (NTSK): 9957555959
- Dibrugarh (DBRG): 9957555960