థానేలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. బాలికల్ని తల్లులే వ్యభిచార రొంపిలోకి దింపి?
మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్ ప్రాంతం కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. నగరంలో వ్యభిచారాన్ని నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేకంగా యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సెల్ (ఎహెచ్‌టీసీ) న
మహారాష్ట్ర, థానే రైల్వే స్టేషన్ ప్రాంతం కేంద్రంగా సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. నగరంలో వ్యభిచారాన్ని నిరోధించేందుకు పోలీసులు ప్రత్యేకంగా యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ సెల్ (ఎహెచ్‌టీసీ) ని ఏర్పాటు చేశారు. ఇంతకాలం స్టేషను ప్రాంతంలోని లాడ్జీలు, బార్‌లు కేంద్రంగా సాగిన ఈ బాగోతానికి పోలీసులు బ్రేక్ వేయాలనుకున్నారు. ఇందులో భాగంగా అక్రమంగా నడుస్తున్న లాడ్జీలు, బార్‌లను పోలీసు ప్రత్యేక విభాగం కూల్చివేసింది.
ఫలితంగా థానే రైల్వేస్టేషను 10 నెంబరు ప్లాట్ ఫాం పై ఉన్న 17మంది వ్యభిచారిణులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఏడుగురు బంగ్లాదేశ్ మహిళలున్నారు. వారి వద్ద పాస్ పోర్టు కాని ఏ ఇతర గుర్తింపుపత్రాలు లేవని, బంగ్లాదేశ్ నుంచి వారెలా దేశంలోకి వచ్చారో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
మరోవైపు కోల్‌కతాలో చిన్నారులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 8-14 ఏళ్ల లోపు గల బాలికలను వ్యభిచార రొంపిలోకి.. స్వతహాగా బాలిక తల్లులే దింపుతున్నారని పోలీసుల విచారణలో తేలింది.