మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?
మొక్కజొన్న పిండిని వంటల్లో చేర్చుతాం. అదే పిండి అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది తెలుసా.. ఒక టేబుల్ స్పూన్ తేనె, కార్న్‌ఫ్లోర్‌ను కొద్దిగా నిమ్మరసంతో ఫేస్ మాస్క్‌ను తయారు చేసి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం ద్వారా అందం మెరుగవుతుంది.
తేనెలోని యాంటీ బాక్టీరియల్, హైడ్రేటింగ్ లక్షణాలు చర్మాన్ని ప్రశాంతపరుస్తాయి. అయితే నిమ్మరసం చర్మ రంధ్రాలను ప్రకాశవంతం చేయడానికి, బిగుతుగా వుంచేందుకు సహాయపడుతుంది. ఈ మాస్క్ శరీరానికి ఉత్తేజం చేస్తుంది.
టమోటా గుజ్జు, కార్న్‌ఫ్లోర్, చక్కెర కలిపి పోషకమైన ఫేస్ మాస్క్‌ను తయారు చేసి ఫేస్‌కు అప్లై చేస్తే చర్మం ప్రకాశవంతం అవుతుంది. టమోటాలోని సహజ ఆమ్లత్వం చర్మ రంధ్రాలను బిగించి, చర్మ హెచ్‌ని సమతుల్యం చేస్తుంది. చక్కెర మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఈ మాస్క్ చర్మాన్ని తాజాగా, మృదువుగా చేస్తుంది.
అలాగే మెత్తని అరటిపండు గుజ్జుతో కార్న్‌ఫ్లోర్‌తో కలిపి ఫేస్ మాస్క్‌లా వేసుకుంటే.. చర్మం తేమగా, మృదువుగా మారుతుంది. ఇంకా కార్న్‌ఫ్లోర్, తేనె, పాలు కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవడం ద్వారా చర్మంపై మంట తగ్గుతుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.