ఏయ్.. యోగి... చేతకాకుంటే రాజీనామా చేయ్ : రాజ్ బబ్బర్ నోటిదూల
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ బబ్బర్ తన నోటిదూలను ప్రదర్శించారు. ఓ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరచిపోయి.. ఏయ్.. యోగి... రాష్ట్రంలో శాంతిభద్రతలన
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్ బబ్బర్ తన నోటిదూలను ప్రదర్శించారు. ఓ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరచిపోయి.. ఏయ్.. యోగి... రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించలేకుంటే ముఖ్యమంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతామని చెప్పారని, కానీ ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో లేవన్నారు. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయకుంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని వేరే వారికి అప్పగించాలని చెప్పారు.
మరోవైపు, రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ఏం ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. ప్రకటనలు తప్పితే, నేరాలను తగ్గించడం లేదని బీఎస్పీ నేత లాల్జీ వర్మ అన్నారు. రాత్రి 12 గంటల వరకు నిరభ్యంతరంగా మహిళలు తిరగవచ్చునని ప్రభుత్వం చెబుతోందని, కానీ అత్యాచారాలు మాత్రం యధేచ్చగా జరుగుతున్నాయని చెప్పారు.