బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2015 (11:10 IST)

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమారుడు - కోడలు విడిపోయారు ఎందుకని?

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి. ఈ పేరు ఐటీ ప్రపంచానికి బాగా సుపరిచితం. ఈయన కుమారుడు రోహన్ మూర్తి. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బాగా సన్నిహితుడు. ఈయన తన భార్య లక్ష్మీ వేణు నుంచి విడాకులు తీసుకున్నారు. రోహన్ మూర్తి - లక్ష్మి వేణులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఎంతో చూడముచ్చటైన ఈ జంట ఇకపై వేర్వేరుగా తమ జీవితం కొనసాగించనున్నారు. 
 
నిజానికి వీరిద్దరి వివాహం ఓ సంచలనమే. ఐటీ ప్రపంచ రారాజుగా వెలుగొందిన ఎన్.ఆర్.నారాయణ మూర్తి తనయుడిగా గుర్తింపు పొందిన రోహన్ మూర్తి.. ఫేమస్‌ బిజినెస్‌ టైకూన్‌ టీవీఎస్‌ గ్రూప్‌కు చెందిన వేణు శ్రీనివాసన్‌ కుమార్తె లక్ష్మీ వేణును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2010 ఆగస్టులో వీరిద్దరికి నిశ్చితార్థం జరుగగా, 2011 జూన్ నెలలో చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వైవాహిక జీవితం ఐదేళ్ళ పాటు సాగింది. 
 
ఆ తర్వాత ఏం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియక పోయినప్పటికీ.. ఈ జంట మాత్రం ఇపుడు విడాకులు తీసుకున్నారు. దీనిపై ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత విషయమైనా.. సెలబ్రిటీ కావటంతో వీరిగురించి ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. కానీ వారి తరపు న్యాయవాదులు స్పందిస్తూ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన వీరివురు తమ వైవాహిక జీవితం విడివిడిగా జీవించాలని కోరుకున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితమే ఈ విషయమై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారని.. వీరివురికి చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని తెలిపారు.