షార్ట్ వీడియోలపై దృష్టి పెట్టిన యూట్యూబ్.. క్రియేటర్ల కోసం కొత్త రూట్
షార్ట్ వీడియోలపై యూట్యూబ్ దృష్టి సారించింది. షార్ట్ ఫారమ్ వీడియోపై డబ్బులు సంపాదించేందుకు క్రియేటర్లను ప్రోత్సహిస్తోంది యూట్యూబ్. ఇందులో భాగంగా షార్ట్ వీడియోల క్రియేటర్‌ల కోసం యూట్యూబ్ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. మారుతున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో (సృష్టికర్తలకు) భారీ మద్దతునిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నామని సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ రారాజు. తన యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించిన యూట్యూబ్ తాజాగా క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో యూజర్లనుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.