శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (18:10 IST)

ఎన్డీయేలోకి జగన్ వస్తే ఆహ్వానిస్తాం.. కేసులింకా రుజువు కాలేదు: అథవాలే

ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీ మళ్లీ వస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం తప్పుకోవడం బాధాకారమని రాందాస్ అథవాలే చెప్పారు. ఏపీలో వైకాపా కూడా బలమైన పార్ట

ఎన్డీయేలోకి తెలుగుదేశం పార్టీ మళ్లీ వస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం తప్పుకోవడం బాధాకారమని రాందాస్ అథవాలే చెప్పారు. ఏపీలో వైకాపా కూడా బలమైన పార్టీ అని... ఎన్డీయేలో చేరాలంటూ ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తాయన్నారు. జగన్‌పై కేసులింకా రుజువు కాలేదని రాందాస్ అథవాలే చెప్పారు. ఏపీలో బలమైన నాయడుకు జగనేనని తెలిపారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ కక్ష సాధింపులకు దిగిందని, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాకే అతనిపై కేసులొచ్చాయని చెప్పారు. 
 
అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు సరిగా లేదని అథవాలే అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి బీజేపీ కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని అథవాలే వెల్లడించారు.