శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (12:53 IST)

మహర్నవమి శుభాకాంక్షలు: అయ్యవారికి ఐదు వరహాలు పిల్లలకు చాలు పప్పుబెల్లాలు..

మూలానక్షత్రం సప్తమినాడు సరస్వతిపూజ, అష్టమినాడు దుర్గాదేవిపూజ (దుర్గాష్టమి), నవమినాడు ఆయుధపూజ (పరిశ్రమలలో యంత్రాలకు పూజలుచేసి బలులు ఇస్తారు), దశమినాడు విజయదశమి జరుపుకుంటూ శమీపూజ చేస్తారు, పలుప్రాంతాలలో దశావతారాలతో పూజలు చేస్తారు. 
 
గర్ధంతి శైలశిఖరేషు విలంబి బింబా మేఘావియుక్త వనితా హృదయానుకారాః ఏషాం రవేణ నహసోత్పతి తైర్మయూరైః ఖలవీజ్యతే మణిమయైరివ తాలవృంతైః అని ప్రథమావతారంతో ప్రారంభం అవుతుంది, దశావతారాల అలంకారం, దీనికి మన తెలుగునాట మరో విశిష్టమైన ప్రయోజనంకూడా ఉంది. 
 
పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను తీసుకొని వారి వారి ఇండ్లకు వెడతారు. అక్కడ పిల్లలకు పప్ప బెల్లాలు పంచిపెడతారు. ఉపాధ్యాయులకు దక్షిణాదులిస్తారు. ఇందువల్ల పల్లెల్లో కలుపుకోరుతనము పెరుగుతుంది. ఒకరికొకరు పెద్దలు పరిచయం చేసుకుంటారు. ఇది ఒకనాటి సంప్రదాయం. అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్లలకు చాలు పప్పుబెల్లాలు అని పిల్లలు పాటలు పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతారు. 
 
అయ్యవార్లు పిల్లలచేత "మహర్నవమిగడలు" అని కట్టిస్తారు.ఈ సందర్భముగా పోతనామాత్యుడు రచించిన నారాయణ శతకంలోని "ధరసింహాసనమై" అన్న పద్యాన్ని పిల్లలచేత కంఠస్థం చేయించి, చదివిసూ తిరుగుతారు. ఈ పద్యం మన కళ్లముందు ఓ భూగోళాన్ని చూపిస్తుంది. ఈ ఉత్సవాలతోపాటు దేవీ నవరాత్రిపూజలు (వ్రతాలు) జరుగుతాయి. 
 
రామాయణ కాలం నాటికే శ్రీదేవీ నవరాత్రిపూజలు జరుపుకోవడం ఆచారంగా ఉండి రావణుడు సీతా మహాసాధ్విని అపహరించుకొని పోయినప్పడు శ్రీరాముడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అప్పడు శ్రీదేవీని నవరాత్రి వ్రతాన్ని ఆచరించవలసిందిగా నారదమహర్షి శ్రీరామచంద్రునికి ఉపదేశించాడు. ఈ ప్రతాన్ని తొమ్మిదిరోజులు "దేవీనవరాత్రి వ్రతంగా" ఆచరించి విజయదశమిరోజున ప్రతసమాప్తి చేస్తారు.