నవరాత్రి తొలి రోజు.. జీడిపప్పు హల్వాను నైవేద్యంగా పెడితే?
ముందుగా జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక లీటరు పాలు స్టౌమీద పెట్టి బాగా మరిగేటప్పుడు మనం ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న జీడిపప్పు ముద్దను వేసి బ
నవరాత్రుల్లో తొలిరోజు జీడిపప్పుతో హల్వాను నైవేద్యంగా సమర్పించుకోవాలి. నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజున శైలపుత్రీ దేవిని పూజించాలి. ఆ రోజున అమ్మవారికి జీడిపప్పు హల్వా, పూరీ, సజ్జతో అప్పాలు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం, బియ్యం రవ్వతో చేసిన పాయసం సమర్పించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. వీటిలో జీడిపప్పుతో హల్వా ఎలా చేయాలంటే?
కావలసిన పదార్ధాలు: జీడిపప్పు-150 గ్రాములు,
యాలకలు - 5,
పాలు - ఒక లీటరు,
పంచదార - 200 గ్రా,
మిఠాయి కలర్ - చిటికెడు.
తయారీ విధానం: ముందుగా జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక లీటరు పాలు స్టౌమీద పెట్టి బాగా మరిగేటప్పుడు మనం ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న జీడిపప్పు ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.
స్టౌమీద పాలలో ఉడికే జీడిపప్పుకు పంచదారను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా గట్టిపడేదాకా స్టౌమీద ఉడికించాలి. అలా గట్టిగా ముద్దగా తయారైన తర్వాత మిఠాయి కలర్‌ను, ఏలకుల పొడిని వేసి బాగా కలుపుకుని దించేసుకుంటే జీడిపప్పు హల్వా రెడీ. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్‌లో రోల్స్‌లా తయారు చేసుకోవచ్చు.