గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (15:50 IST)

విజయదశమి.. శమీపూజ ఎప్పుడు చేయాలి..

durga maata
విజయదశమి ఈ ఏడాది ఏ రోజున జరుపుకోవాలని విషయంలో గందరగోళం నెలకొంది. కొందరు ఈ నెల 23వ తేదీ సోమవారం జరుపుకోవాలా.. లేదా అక్టోబర్ 24వ తేదీ మంగళవారం జరుపుకోవాలా అనే విషయంపై క్లారిటీగా లేరు. అయితే కొన్ని పంచాంగాల ప్రకారం విజయదశమి 23వ తేదీ సోమవారం జరుపుకోవాలని పేర్కొంది. 
 
విజయదశమి పండుగను హిందువులు దశమితో కూడిన శ్రవణా నక్షత్రంలో జరుపుకుంటారు. ఈ శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలోనే శమీ పూజను జరుపుతారు. శ్రవణా నక్షత్రం ఈ రోజు అంటే  ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. 
 
మంగళవారం రోజున ధనిష్ట నక్షత్రం వస్తుంది. ఈ ధనిష్ట నక్షత్రంలో విజయదశమి పండుగ జరుపుకోకూడదు. శ్రవణా నక్షత్రంలో  దశమి కలిస్తే అది విజయదశమి అవుతుంది. కనుక దశమి.. శ్రవణ నక్షత్రం కలిసి 23వ తేదీ సోమవారం  దసరా పండుగ శమీ పూజ జరుపుకోవాలని సూచిస్తున్నారు.