మూడు రోజుల అమెరికా తెలంగాణ ప్రపంచ మహాసభల్లో ఏం జరగబోతున్నాయంటే.

(జూలై 7, డెట్రాయిట్) అమెరికా తెలంగాణ అసోసియేషన్ జూలై 8 నుండి 10 వరకు జరుపబోయే సమావేశాల దృష్ట్యా వివిధ కమిటీల చైర్స్ సర్వం సిద్ధం చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, డెకరేషన్ కమిటీ చైర్ గంప శ్రీనివాస్ మాట్లాడుతూ, చార్మినార్, కాకతీయ కళాతోరణాల మాడల

American Telangana Association Committee
ivr| Last Modified గురువారం, 7 జులై 2016 (19:21 IST)
(జూలై 7, డెట్రాయిట్) అమెరికా తెలంగాణ అసోసియేషన్ జూలై 8 నుండి 10 వరకు జరుపబోయే సమావేశాల దృష్ట్యా వివిధ కమిటీల చైర్స్ సర్వం సిద్ధం చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, డెకరేషన్ కమిటీ చైర్ గంప శ్రీనివాస్ మాట్లాడుతూ, చార్మినార్, కాకతీయ కళాతోరణాల మాడల్స్ తయారు చేస్తున్నాం అని చెప్పారు.
 
విందు జరిగే చోటు టాంక్ బండ్ ఈట్ స్ట్రీట్‌ని తలపింప చేసేట్టు, తెలంగాణ టూరిజం వారితో అనుసంధానమై జిల్లాల వారిగా వివరాలు తెలియచేసే డెకరేషన్ ఉండబోతుంది అని తెలియచేసారు. ఎక్కడికక్కడ వేదికల నిండుగా మొత్తం తెలంగాణ తోరణాలు కనిపిస్తాయి అని చెప్పారు.
American Telangana Association Committee
 
రిజిస్ట్రేషన్ చైర్ వెంకట్ అడప గారు మాట్లాడుతూ, ఇప్పటికే బాంక్వెట్ టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఊహించిన దానికన్నా అశేష సంఖ్యలో రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని తెలియచేసారు.
American Telangana Association Committee
 
బాంక్వెట్ కమిటీ చైర్మన్ శైలేంద్ర సనం గారు మాట్లాడుతూ, వచ్చిన వారందరికీ ఏ ఇబ్బందీ లేకుండా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి అధ్బుతమైన లేఅవుట్‌తో రెండు వేల మందికి సరిపడా ప్లానింగ్ తయారుచేశామని తెలియచేసారు.
American Telangana Association Committee
 
సావనీర్ కమిటీ చైర్మన్ రాజ్ మాడిశెట్టి మాట్లాడుతూ వచ్చే వారందరికీ ఈ మూడు రోజులు గుర్తుండిపోయేలా సావనీర్ ఐటమ్స్ అందచేస్తాం అని తెలియచేసారు. ఇదే సావనీర్‌లో భాగంగా “ప్రవాస తెలంగాణ సాంస్కృతిక సమరుజ్జీవన ప్రత్యేక సంచిక” ని తీసుకురాబోతున్నాం. ఆహ్వానం పంపగానే వేల కొలది రచనలు రావడం ఆనందంగా ఉందని ప్రచురణకు స్వీకరించిన రచనల వివరాలు త్వరలోనే అందచేస్తామని, ప్రతిపాదించిన మొత్తాన్ని ఈవెంట్ తరవాత రచయితలకు అందజేస్తామని సంచిక ఎడిటర్ కృష్ణ చైతన్య అల్లం తెలిపారు.
American Telangana Association Committee
 
ఎగ్జిబిట్స్ చైర్మన్ కొంపల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, వ్యాపార, వాణిజ్య, వర్తక, ఐటి, ఫుడ్, రిటైల్, అన్ని రకాల సంస్థలకు చోటు కల్పించాం. సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ విధానం ద్వారా అందరికీ తగిన చోటు, వ్యూయబిలిటీ ఉంటుంది అని తెలియచేసారు.
American Telangana Association Committee
 
కమ్యూనికేషన్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్ శ్రీధర్ ఐత మాట్లాడుతూ, వివిధ కమిటీలని, ఏర్పాట్లని కో-ఆర్డినేట్ చేస్తూ, ఎదురయ్యే సమస్యలని ఎక్కడికక్కడే పరిష్కరిస్తూ, అతి తక్కువ వ్యవధిలో మేము అందుకున్న దూరాన్ని చూస్తే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా సాధ్యం అనుకున్న స్థాయి నుండి అంకిత భావం ఉంటే చేయగలమని మా కమిటీలు అన్నీ నిరూపించాయని అన్నారు. వినోద్ కుకునూర్, భుజంగ రావు, శ్రీనివాస్ సజ్జ, వెంకట్ బొల్లవరం తదితరులు తమ కమిటీల విషయాలని తెలియచేసారు. ప్రెసిడెంట్ రాంమోహన్ కొండ మాట్లాడుతూ, కొండంత పని ఇస్తే ఒక్కొక్కరూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అన్ని కమిటీలకు, చైర్లకు, కో-చైర్లకు, వివిధ ప్రతినిధులకూ, వాలంటీర్లకు పేరు పేరునా కృతఙ్ఞతలు తెలిపారు.దీనిపై మరింత చదవండి :