'నాట్స్ రీవార్డ్స్ కార్డ్' ఆవిష్కరించిన డా. గజల్ శ్రీనివాస్

NATS-Reward-card-launch
ivr| Last Modified సోమవారం, 2 మే 2016 (22:15 IST)
న్యూజెర్సీ: నాట్స్ సభ్యులకు మెరుగైన సంక్షేమం, సదుపాయం కల్పించడంలో భాగంగా నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్యాం మద్దాళి, నాట్స్ రివార్డ్ కార్డులు పరిచయం చెయ్యగా, న్యూజెర్సీలో ఈ కార్డును ఆ సంస్థ నాట్స్ బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు బారీ పామర్ పాల్గొన్నారు. 
 
డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ కార్డు ద్వారా అమెరికాలోనే కాకుండా భారతదేశం మరియు ఇతర దేశాలలో కూడా అనేక వ్యాపార సంస్థలలో చేసిన కొనుగోలుపై నాట్స్ సభ్యులకు మంచి రాయితీలు లభిస్తాయని మరిన్ని వ్యాపార సంస్థలు నాట్స్ రివార్డ్ కార్డుపై డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు కొర్రపాటి, దేశ్ గంగాధర్, బసవేంద్ర సూరపనేని, శ్రీమతి గంటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం న్యూజెర్సీలోని మన్విల్లె - రిథమ్స్‌లో జరిగింది.దీనిపై మరింత చదవండి :