'బాహుబలి' బ్రహ్మాండ సంగీత ఝరి... ఎం.ఎం.కీరవాణి సంగీత విభావరి... 'entertainments'లో...

keeravani
ivr| Last Modified గురువారం, 14 జనవరి 2016 (15:07 IST)
ప్రముఖ సాంసృతిక సంస్థ సంస్కృతి 'entertainments' ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పండుగని పురస్కరించుకొని డిట్రాయిట్ మహా
నగరంలో తెలుగు సినీ సంగీత సామ్రాట్, మరకతమణి శ్రీ ఎం.ఎం. కీరవాణి గారి సంగీత విభావరి కార్యక్రమాన్ని జనవరి 15న నిర్వహిస్తున్నారు. ప్రముఖ గాయనీగాయకులు గీతామాధురి, రమ్య, రేవంత్, దామిని, గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొంటున్న
ఈ కార్యక్రమానికి స్థానిక డిట్రాయిట్ తెలుగువారు, సంగీత ప్రియుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది.

ఎల్లుండి జరుగబోయే ఈ సంగీత సంబరాల విజయానికి సంస్కృతి సభ్యులు, స్వచ్చంద సేవకులు, కార్యకర్తలు
ఉత్సాహంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సమన్వకర్తలుగా సంస్కృతి entertainments సభ్యులు- జగదీష్ బొడ్డపాటి, శ్రీనివాస్ సజ్జా, అశోక్ బడ్డి, శ్రీనివాస్ కొంపెల్ల వ్యవహరిస్తున్నారు. రాజ్ కామేటి, సత్య ఇంజేటి, అనిల్ చిట్టోజి, విజయ్ పల్లెర్ల, శ్రీనివాస్ రాజు, కృష్ణ ఆలపాటి, వెంకటేష్ బాబు, సౌద కొంపెల్ల, శ్రీనివాస్ కొత్తపల్లి, రాంగోపాల్ ఉప్పుల, ప్రసాద్ బేతంచెర్ల, వెంకట్ లింగమనేని, బాలాజీ సత్యవరపు, శ్రీనివాస్ దొడ్డిపట్ల, కిశోరే తమ్మినీడి, దీపక్ సూరపనేని, చైతన్య విష్ణుబొట్ల, హింతేంద్ర పావులూరు ఎందరో ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లకు తోడ్పడుతున్నారు.దీనిపై మరింత చదవండి :