మల్లియలారా... మాలికలారా మౌనముగా వున్నారా... సినారె కలం నుంచి...(వీడియో)

సి. నారాయణ రెడ్డి. 3 వేల పాటలకు పైగా ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన ఓ సాహిత్య ప్రవాహం. భావాల్లో ఎన్నో లోతులు... జీవితాన్ని తట్టిలేపే ఎన్నో పాటలు. నవరసాల సమ్మేళనం ఆయన గీతాల సారాంశం. మల్లియలారా... మాలికలారా.... ఆ పాట సాహిత్యం ఒక్కసారి...

C NarayanaReddy
ivr| Last Modified సోమవారం, 12 జూన్ 2017 (17:28 IST)
సి. నారాయణ రెడ్డి. 3 వేల పాటలకు పైగా ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన ఓ సాహిత్య ప్రవాహం. భావాల్లో ఎన్నో లోతులు... జీవితాన్ని తట్టిలేపే ఎన్నో పాటలు. నవరసాల సమ్మేళనం ఆయన గీతాల సారాంశం. మల్లియలారా... మాలికలారా.... ఆ పాట సాహిత్యం ఒక్కసారి...

మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా
మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా
ntr

జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెలలోనే చీకటి మూగే
జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెలలోనే చీకటి మూగే
పలుకగ లేక పదములు రాక
పలుకగ లేక పదములే రాక
బ్రతుకే తానే బరువై సాగే

మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా

చెదరిన వీణా రవళించేనా
జీవన రాగం చివురించేనా
చెదరిన వీణా రవళించేనా
జీవన రాగం చివురించేనా
కలతలు పోయి వలపులు పొంగి
కలతలే పోయి వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా

మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారాదీనిపై మరింత చదవండి :