ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (09:36 IST)

'ఆద్యంత ప్రభు'.. సగం వినాయకుడు- సగం హనుమంతుడు పూజిస్తే..?

Adyantha Prabhu
Adyantha Prabhu
వినాయకుడు-హనుమంతుని సమ్మేళన రూపాన్ని 'ఆద్యంత ప్రభు' అంటారు. ఈ రూపానికి ఒకవైపు గణేశుని మరోవైపు హనుమంతుని ముఖం ఉంటుంది. 
 
'ఆది' అంటే 'మొదటి' అని అర్థం 'అంతం' అంటే 'ముగింపు'. అలా ఒక కార్యాన్ని ప్రారంభించేందుకు ముందు ఆది దేవుడైన గణేశుడిని పూజించడం ద్వారా ప్రారంభించినట్లయితే, హనుమంతుడు దానిని విజయవంతంగా పూర్తి చేస్తాడు. బ్రహ్మచార్య ఉపవాసం పాటించేవారు ఈ ఇద్దరు బ్రహ్మచారుల రూపాన్ని తమ ఇష్ట దైవంగా పూజిస్తారు. హనుమంతుడు, శివుని అంశం. 
 
అదేవిధంగా, గణేశుడు శక్తి నుండి జన్మించాడు. ఈ విధంగా వారిని హనుమంతుడిని, వినాయకుడిని పూజించడం ద్వారా శివపార్వతులను పూజించినట్లైనని వారి అనుగ్రహం లభించినట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. వీరిద్దరినీ 45 రోజుల పాటు పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
ఆద్యంత ప్రభు రూపంలో బంగారు గణేశుడు అని పిలువబడే హేరంబ గణపతి వుంటారు. ఈయన సంపదను ఇస్తాడు. సింహంపై కూర్చున్న ఐదు తలలు, పది చేతులతో దర్శనమిచ్చే హనుమంతుడిని పూజించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.