శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే..?
శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే.. సర్వశుభాలు చేకూరుతాయి. తద్వారా కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. శంఖువును తులసీ దళాలతో పూజించడం ద్వారా బ్రహ్మహత్తి దోషం తొలగిపోతుంది. అలాగే శంఖువుతో స్వామికి అభిషేకం చేసినట్లైతే సర్వ దోషాలు తొలగిపోతాయి.
ముఖ్యంగా కార్తీక సోమవారం లేదంటే ఏ సోమవారం 108 శంఖువులతో అభిషేకం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. వాస్తు దోషం ఉన్న ఇంట్లో, శంఖువులో వుంచిన తులసి తీర్థాన్ని చల్లితే దోషం తొలగిపోతుంది. ఇంకా అప్పులు తొలగిపోవాలంటే.. ప్రతి పౌర్ణమికి శంఖువుకు కుంకుమార్చన చేయించడం మంచిది. తద్వారా రుణం కనుమరుగు అవుతుంది.
16 వారాలు శంఖువు మధ్యలో దీపం వెలిగిస్తే అప్పులు తొలగిపోతాయి. శంఖువు పూజ చేసే ఇంట దుష్టాత్మలు, దుష్టశక్తులు దరిచేరవు. చిన్నారులకు జ్వరం వస్తే శంఖువులో పోసిన నీళ్లను మాత్రమే తాగిస్తే జ్వరం, దోషాలన్నీ పోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.