అప్పులు తీరాలంటే.. పుట్టింటి నుంచి అవి తెచ్చుకోవాలట.. స్పటిక గణపతిని..?

Lakshmi Devi
Lakshmi Devi
సెల్వి| Last Updated: శనివారం, 21 నవంబరు 2020 (18:51 IST)
అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. స్త్రీలు లక్ష్మీమూర్తిగల గొలుసును మెడలో ధరించాలని వారు చెప్తున్నారు. కుడిచేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి. అలాగే స్పటిక గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో వుంచి పూజిస్తూ వుండాలి. చీమలు ఎక్కువగా వున్న ప్రదేశాల్లో.. ఆరుబయట గురువారం రోజున అరకేజీ చక్కెర పోసి ఆహారం కల్పించాలి.

దీపావళి అమావాస్య రోజున 108 నాణేలతో లక్ష్మీ అష్టోత్తరం చేసి.. వాటిని ధనం వుంచే పెట్టెలో బీరువాలో భద్రపరచాలి. ఇరవై శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేయాలి. దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజు కుబేరాష్టోత్తరం మూడుసార్లు పారాయణ చేయాలి.

సన్నిహితులకు వెండి లక్ష్మీ విగ్రహాన్ని దానంగా ఇవ్వాలి. పుట్టింటి నుంచి రెండు దీపపు కుందులు తెచ్చుకుని స్త్రీలు నిత్యం వెలిగించడం ద్వారా రుణబాధలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :