గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (09:57 IST)

వారాహిని ఏ రాశి, నక్షత్రం వారు పూజించాలి.. పంచమి రేపే ఇలా చేస్తే..?

Varahi
Varahi
సప్త కన్యల్లో ఒకరైన వారాహి అమ్మవారు.. దైవ గుణం, జంతువు అంశను కలిగివుంటారు. ఈమె తల్లిని పోలిన కరుణకటాక్షాలు, దయాగుణం కలిగివుంటుంది. వారాహి దేవి తాంత్రికులు ఉగ్రదేవతగా ఆమెను పూజిస్తారు. అయితే వారాహి దేవిని శ్రీ మహావిష్ణువు వారాహి అవతార అంశగా పేర్కొంటారు. సప్తకన్యల్లో బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే వారిలో వరాహ మూర్తిగా ఈమె భక్తులకు దర్శనమిస్తుంది. 
 
ఈమెను పూజించే వారికి శత్రుభయం వుండదు. అప్పుల బాధలు వుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. వారాహి దేవిని కాశీ, తంజావూర్ వంటి సుప్రసిద్ధ ఆలయాల్లో కొలుస్తారు. ఈమెకు కాశీలోనూ, తంజావూరులో ప్రత్యేక సన్నిధానం వుంది. 
 
వారాహి మాతను పూజించే వారు మనస్సులో ఎలాంటి దురాలోచనలు లేకుండా వుండాలి. కోరే కోరికలు న్యాయంగా వుండాలి. ధర్మానికి అనుగుణంగానే ఆమెను వరాలను ఇస్తుంది. కోరిన కోరికలను నెరవేర్చే తల్లిగా వారాహి భక్తులచే పూజించబడుతోంది. 
 
అయితే ఇతరులకు అన్యాయం చేసే, దురాలోచనలతో కూడిన దుర్భుద్ధితో ఆమెను కొలిస్తే.. ఫలితం వుండదు. ఆమెను వారాహి మూల మంత్రంతో ప్రతి నిత్యం పూజించే వారికి సర్వమంగళం చేకూరుతుంది. 
 
ఇంట్లో వారాహి మాత విగ్రహం కానీ, చిత్రపటాన్ని పూజించేవారు.. ఉత్తరం వైపు వుంచి పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. వారాహి మాత ఉత్తరం దిశకు అధిపతిగా ఆమెను పరిగణిస్తారు. వరాహి మాత ప్రతిమ కానీ విగ్రహం కానీ చిత్రపటం కానీ లేని వారు రోజూ ఓ ప్రమిదను దీపం వెలిగించి ఆమెను వారాహిగా పూజించాలి. 
 
అలాగే వారాహి దేవిని పూజించేటప్పుడు ఆమెను ఇష్టమైన నీలం, ఎరుపు, పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, దానిమ్మలు, ఎరుపు రంగు పుష్పాలు సమర్పించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాల్లో కృత్తిక, మూల, రేవతి, పూర్వ పాల్గుణి జాతకులు వారాహి మాతను తప్పక పూజించాలి. 
 
అలాగే 12 రాశుల్లో మకరం, కుంభ రాశి జాతకులు వరాహిని పూజించడం ద్వారా కష్టాలు దరిచేరవు. అంతేగాకుండా శని ఆధిక్యం, శనిదోషాలు, ఏలినాటి నటి, శని దశ నడిచేవారు వారాహి మాతను పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
మంగళ, శుక్ర, శని వారాల్లో వారాహి దేవికి దీపం వెలిగించి పూజించడం మంచిది. అంతేగాకుండా వారాహి అమ్మవారిని పౌర్ణమి, అమావాస్య, పంచమి (14 ఫిబ్రవరి 2024) వంటి తిథుల్లో పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.