గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (12:07 IST)

వారాహి దేవిని ఇలా పూజిస్తే... అన్నీ శుభాలే..

Varahi Matha
శ్రీలక్ష్మి అంశంగా పేర్కొనబడే వారాహి దేవి న్యాయమైన కోరికలను నెరవేరుస్తుంది. నిర్మలమైన మనస్సుతో ఆమెను కొలిచే భక్తులకు ఆమె కొంగుబంగారం. అలాంటి వారాహి దేవిని పంచమి తిథి నాడు పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
 
పంచమి రోజున సూర్యోదయానికి ముందే శుచిగా స్నానమాచరించి.. ముందుగా గణపతిని పూజించాలి. ఆ తర్వాత ఇంట్లో వారాహి చిత్రం ఉంటే మందార పువ్వులను ఆమెకు సమర్పించాలి.  ఇంటో వారాహి పటం లేని వారు ప్రమిదతో నేతి దీపం వెలిగించాలి. ఆ దీపాన్నే వారాహి దేవిగా భావించి సంకల్పం చెప్పుకోవాలి. ఆపై వారాహి దేవికి సంబంధించి వజ్ర ఘోషం, వారాహి మూల మంత్రం, వారాహి గాయత్రిలతో ఆమెను స్తుతించాలి. 
 
నైవేద్యంగా..  పచ్చి కర్పూరం, యాలక్కాయ, బెల్లం కలిపిన పానకం సమర్పించాలి. పాలు, మినపప్పు గారెలు, పెరుగు అన్నం, నువ్వుల ఉండలు, దానిమ్మ పండును సమర్పించుకోవచ్చు. 
 
"ఓం శ్యామలాయై విద్మహే 
హల హస్తాయై ధీమహి 
తన్నో వారాహి ప్రచోదయాత్" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మవారిని నమస్కరించాలి. ఇలా చేస్తే వృత్తిలో ఏర్పడే సమస్యలు, శత్రుభయం, నరదృష్టి, రుణబాధలు, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. కార్యసిద్ధి చేకూరడటం, సంపద పెరగడం జరుగుతాయి.