గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2023 (21:40 IST)

పచ్చి కొబ్బరి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

పచ్చి కొబ్బరి. ఇందులో పోషకాలు అపారం. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీన్లోని పోషకాలు అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. పచ్చి కొబ్బరి తింటే శరీరంలోని వ్యర్థాలు బైటకు పోతాయి.
 
రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. పచ్చికొబ్బరి తింటే థైరాయిడ్ సమస్య అదుపులో వుంటుంది. శరీరంలో దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలో కొబ్బరి కీలకపాత్ర పోషిస్తుంది. గుండెకి మేలు చేసే గుణాలు పచ్చికొబ్బరిలో వున్నాయి.
 
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పచ్చికొబ్బరి తింటే తగ్గుతాయి. మధుమేహం సమస్య వున్నవారిలో సమస్య నియంత్రించబడుతుంది. ఐతే ఇది నిపుణుల సూచన మేరకు తీసుకోవాలి.