Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం (25-02-2018) మీ రాశి ఫలితాలు..

మేషం : మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం వరిస్తుంది. రవాణా రంగంలో

Written By raman
Updated: ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (08:49 IST)
మేషం : మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం వరిస్తుంది. రవాణా రంగంలోని వారికి లాభదాయకం.
 
వృషభం : రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలు ఎటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో వ్యవహరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్మలను మోసగిస్తారు.
 
మిథునం : ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
కర్కాటకం : ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.
 
సింహం : కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. ఉపాధ్యాయులు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి.
 
కన్య : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రులను నుంచి అపనిందలు అవమానాలు వంటివి ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకులు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
 
తుల : గృహమునకు కావలసిన మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వ్యాపార రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీల సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
వృశ్చికం : స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. విరామ కాలక్షేపాల ద్వారా ఊరట చెందుతారు.
 
ధనస్సు : బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్సాంతి దూరం చేస్తాయి. పాత మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.

మకరం : వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. భాగస్వామికుల మధ్య ఏకీభావం లోపిస్తుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. స్త్రీలకు గృహ వాతావరణం, సంతానం వైఖరి వల్ల ఆందోళనలు అధికమవుతాయి.
 
కుంభం : రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. దైవ, దర్శనాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీల పనులు వాయిదా వేసుకుంటారు.
 
మీనం : విద్యార్థులు క్రీడా కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటారు. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. కొబ్బరి పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

03-09-2026 గురువారం రాశి ఫలితాలు... కొత్త ప్రాజెక్ట్‌కు అనుకూలమైన రోజు

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?

Tirumala: సర్వ దర్శన్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ

02-09-2026 బుధవారం రాశి ఫలితాలు... సమయపాలన అవసరం

తర్వాతి కథనం
Show comments