శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (08:37 IST)

ఈ రోజు (శనివారం) మీ దినఫలాలు .. నూతన రుణాల కోసం...

మేషం : విద్యార్థులు విద్యా విషయాలపై ఏకాగ్రత వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్త అవసరం. అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్క

మేషం : విద్యార్థులు విద్యా విషయాలపై ఏకాగ్రత వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్త అవసరం. అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు వంటివి తప్పవు. 
 
వృషభం : కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అధికమైన చికాకులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసిరాగలదు. 
 
మిథునం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అనుకూలం. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. ఉద్యోగస్తులకు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం అవసరమని గ్రహించండి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
కర్కాటకం : సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
సింహం : ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీముల కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం  తప్పదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలను పొందుతారు. 
 
కన్య : ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడగలవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేటు, పత్రికా సంస్థల్లోని ఉద్యోగస్తులకు యాజమాన్యంతో అవగాహన లోపిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే కోరిక నెరవేరగలదు. 
 
తుల : ముందుగా ఊహించిన ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : వస్త్ర, కళంకారి, బంగారు, వెండి, చిన్నతహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. రావలసిన బాకీలు వసూలు కాకపోవడంతో ఆందోళన చెందుతారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
ధనస్సు : గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులకు అనుకూలం. చేతి వృత్తి వ్యాపారులకు పనిభారం అధికమవుతుంది. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. సోదరీ సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
మకరం : ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వల్ల పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. రావలసిన ధనం చేతికందుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
కుంభం : వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బంది పడుతారు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీల కళాత్మక, నైపుణ్యతకు మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. 
 
మీనం : మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల పేరు, ఖ్యాతి లభిస్తుంది. యాధృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి.