Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

10-01-2019 గురువారం దినఫలాలు : స్త్రీలకు పనివారితో చికాకులు...

Written By రామన్
Updated: గురువారం, 10 జనవరి 2019 (08:51 IST)
మేషం: దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన మంచి ఫలితాలు సాధించగల్గుతారు. బంధుమిత్రుల నుండి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. 
 
వృషభం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు. స్వర్ణకారులకు, నగల వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. దూరప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు పథకాలు రూపొందిస్తారు. నూతన పరిచయాలేర్పడుతాయి. 
 
మిధునం: దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలందిస్తారు. ప్రముఖుల కోసం నిరీక్షించవలసి వస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కర్కాటకం: కీలకమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మీ యత్నాలు, అభిప్రాయాలకు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.  
 
సింహం: వృత్తులు, క్యాటరింగ్ పనివారల ఆదాయం బాగుంటుంది. మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ధనసహాయం, హామీలు ఉండే విషయంలో దూరంగా ఉండడం మంచిది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. 
 
కన్య: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల కలయిక, నూతన వస్తువులు కొనుగోలు, వస్త్ర లాభములు, వ్యవహార జయము కలుగును. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పాతమిత్రుల కలయికతో కొత్త ఆలోచనలు స్పురిస్తాయి.   
 
తుల: వృత్తి, ఉద్యోగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. అధిక ధనవ్యయం చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి కలిగిరాగలదు. షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. 
 
వృశ్చికం: పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులకు అధిక శ్రమ వలన ఆరోగ్యంలో చికాకులు తప్పవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. 
 
ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో జయం పొందుతారు. విద్యార్థులలో అవగాహన లోపం వలన ఆందోళన ఎదుర్కుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. క్రీడా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులను కలుసుకుంటారు. 
 
మకరం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. హోటల్, క్యాటరింగ్, తినుబండారాలు వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఆదాయానికి మించిన ఖర్చుల వలన ఇబ్బందులు తప్పవు. ప్రతి వ్యవహారంలో చొరవగా ముందుకు దూసుకుపోతారు.    
 
కుంభం: వ్యవసాయదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. గత అనుభవంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.   
 
మీనం: ఆర్థిక రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్టాక్‌మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ఒక సమస్య పరిష్కారం కావడంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. ఖర్చులు అధికం, ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు.  

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments