07-01-2019 సోమవారం దినఫలాలు - ఆ రంగాల వారికి నూతన అవకాశాలు...

mesham
రామన్| Last Updated: సోమవారం, 7 జనవరి 2019 (08:27 IST)
మేషం: ముఖ్యమైన వ్యవహారాలు, పనులు మీరే చూసుకోవడం మంచిది. దూరప్రయాణాలలో మెళకువ అవసరం. చేతి వృత్తి, వ్యాపార రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధుమిత్రుల నుండి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కుంటారు.

వృషభం: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. మీ జీవితం మీరు కోరుకున్నట్టు గానే చక్కగా మలచుకోవడానికి ప్రయత్నించండి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు.

మిధునం: విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రత్యర్థుల విషయంలో తెలివిగా వ్యవహరించడం మంచిదని గమనించండి. మొండి బాకీలు వసూళ్ల వంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలు టి. వి. ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో మెళకువ అవసరం.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల మెళకువ అవసరం. సోదరీసోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తగలవు. బంధువుల రాకవలన గృహంలో కొత్త ఉత్సాహనం, సందడి చోటు చేసుకుంటుంది. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు.


సింహం: పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఎదుటివారిని అతిగా విశ్వసించడం మంచిది కాదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్యసాధనకు మరితంగా కృషి చేయవలసి ఉంటుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది.

కన్య: ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచిన స్పురిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు.


తుల: వ్యాపార విషయంలో ఇతరుల జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితుల కోసం అధికంగా ధనం వ్యయం చేస్తారు. విదేశాల నుండి అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు.

వృశ్చికం: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కళాత్మక విలువలకు ప్రోత్సాహమిస్తారు.

ధనస్సు: తల, ఎముకలకు సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలు సందర్శిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది.

మకరం: వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువుల రాక వలన మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.


కుంభం: అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. తొందరపడి వాగ్దానాలు చేయుట వలన మాటపడక తప్పదు. ఆకస్మికంగా దూరప్రయాణాలు వాయిదాపడుతాయి.మీనం: మిత్రుల కలయిక సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయడం ఉత్తమం. జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా సమసిపోతాయ. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.దీనిపై మరింత చదవండి :