02-01-2019 - బుధవారం మీ రాశి ఫలితాలు.. బాగా ఆలోచించి?

Last Updated: బుధవారం, 2 జనవరి 2019 (10:22 IST)
మేషం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు అధ్యాపకుల నుండి ఒత్తిడి, ఏకాగ్రత లోపం వంటి చికాకులు తప్పవు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి.
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. చేతివృత్తుల వారి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. కీలకమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తారు. మీ సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. 
 
మిధునం: మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఇప్పటివరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. ప్రేమికులు పెద్దల ఆగ్రహావేశాలకు గురికావలసి వస్తుంది. వాహన చోదకులు ఆటంకాలను ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం: అకాల భోజనం, ప్రశాంతత లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రిజిస్ట్రేషన్లకు ఇది అనువైన సమయం కాదు. ధనం ఏమాత్రం నిలబెట్టలేక పోయినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఒకానొక విషయంలో చిత్తశుద్దిని ఎదుటివారు శంకించే అవకాశం ఉంది. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ యత్నాలకు సన్నాహాలు చేయూతనిస్తారు.    
 
కన్య: విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.  
 
తుల: రాజీ ధోరణితో వ్యవహరించడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధువులతో సఖ్యత, రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. 
 
వృశ్చికం: నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు అనుకూలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
ధనస్సు: విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుండి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్న తనంగా భావించకండి. 
 
మకరం: పెద్దల ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. అవివాహితులకు త్వరలో శుభవార్తలు వింటారు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసివస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం, మందకొడితనం వలన మందలింపులు తప్పవు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి.    
 
కుంభం: బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ధనం చేతిలో నిలబడడం కష్టం కావచ్చు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది.  
 
మీనం: పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థుల ఆలోచనులు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాలకు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో నూతన భాగస్వాములను చేర్చుకునే విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. దీనిపై మరింత చదవండి :