బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (21:24 IST)

12-10-2019- శనివారం దినఫలాలు - భాగస్వామితో కానీ, మీకు అత్యంత...

మేషం: ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధికమిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలకపోవటంతో అసహనం తప్పదు. హామీలకు, మధ్యవర్తిత్వాలు, వివాదాలకు దూరంగాఉండటం క్షేమదాయకం .
 
వృషభం: కిరాణా, ఫాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. స్త్రీలకు పని ఒత్తిడి, హడావుడి అధికం. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. 
 
మిధునం: భాగస్వామితో కానీ, మీకు అత్యంత సన్నిహితులైన వారితో కానీ చిన్నవివాదం ఏర్పడవచ్చు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యులు శస్త్ర చికిత్స చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది.
 
కర్కాటకం: ఎదుటివారి తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంలో కొంత నిరుత్సాహానికి గురవుతారు.
 
సింహం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగస్తులు విధినిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది.
 
కన్య: విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. అనవసర ఖర్చులు, మితిమీరిన ధనవ్యయంతో ఆందోళన చెందుతారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. స్త్రీలకు షాపింగ్‌‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
తుల: గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంజనీరింగ్ రంగాలలోని వారికి చికాకులు తప్పవు. రుణాలు తీరుస్తారు. ప్రింటింగ్ పనివారికి పనిభారం, ఒత్తిడి తప్పవు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఇతరుల సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. 
 
వృశ్చికం: స్త్రీల మనోవాంఛలు నెరవేరక పోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంక్ వ్యవహారాలలోని పనులు వాయిదాపడతాయి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు.
 
ధనస్సు: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు అప్పుడప్పుడు ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. యూనియన్ కార్యక్రమాలలో మెలకువ వహించండి. మీ మేలు పొందిన వారే మీపై అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.
 
మకరం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టు కుంటారు. విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్‌‌లలో అనుకూలత, కోరుకున్న విద్యా వికాశాలు లభిస్తాయి. ట్రాన్స్‌‌పోర్టు, ట్రావెలింగ్, ఎక్స్‌‌పోర్టు రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది.
 
కుంభం: ఎల్. ఐ. సి. పోస్టల్ ఏజెంట్లకు శ్రమ, త్రిప్పుట అధికం. వ్యాపార, ఉపాథి పథకాల్లో నిలదొక్కుకోవటానికి బాగా కష్టపడాలి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిరుద్యోగ యత్నాలు ఆశించినంత సంతృప్తిగా సాగవు.
 
మీనం: ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ సంతానం వివాహ, ఉద్యోగ, విద్యా విషయాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.