శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (12:34 IST)

11-10-2019- శుక్రవారం దినఫలాలు - మీ జీవిత భాగస్వామితో కానీ...

మేషం: కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు.
 
వృషభం: బంధుమిత్రులతో పట్టింపులెదుర్కుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. విందులలో పరిమితి పాటించండి. డాక్టర్లు శస్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెలకువ అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి.  
 
మిధునం: వైద్యులు శస్త్రచికిత్స చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. అనుకున్న పనులు కాస్త ఆలస్యమైనా కంగారు పడకండి. స్త్రీలు దైవ దర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు.
 
కర్కాటకం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. మీడియా రంగాల వారికి పనిభారం అధికం. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రేమికులు ప్రతి విషయంలోను మితంగా వ్యవహరించటం క్షేమదాయకం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. 
 
సింహం: స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. మీ జీవిత భాగస్వామితో కానీ, మీకు అత్యంత సన్నిహితులైన వారితో కానీ చిన్న వివాదం ఏర్పడవచ్చు. ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు.
 
కన్య: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. వృత్తి, ఉద్యోగస్తులకు కలిసిరాగలదు. ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. కీలకమైన వ్యవహారాలు మీ జీవితభాగస్వామికి తెలియజేయటం అన్ని విధాలా శ్రేయస్కరం.
 
తుల: ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. నిరుద్యోగులకు, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.
 
వృశ్చికం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఆశాజనం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ప్రేమికుల తొందరపాటుతనం అనర్థాలకు దారితీస్తుంది.
 
ధనస్సు: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఎదుటివారి తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
మకరం: ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది.మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు.
 
కుంభం: అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంలో కొంత నిరుత్సాహానికి గురవుతారు. ఆరోగ్యంలో చికాకులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ కోరిక నెరవేరక పోవటంతో ఆందోళన చెందుతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు.
 
మీనం: కోర్టు వ్యవహారాలు, ఆస్తితగాదాలు పరిష్కారమవుతాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసలుబాటు ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మీ ఆలోచనలను కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు.