శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Modified: గురువారం, 10 అక్టోబరు 2019 (18:19 IST)

10-10-2019- గురువారం దినఫలాలు - ఉద్యోగస్తులకు పనిభారం.. దంపతుల మధ్య..

మేషం: విద్యార్థులకు ఒత్తిడి అధికం. క్రయ విక్రయాలు సామాన్యం. దైవ దీక్షలలో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు విస్తరణలకు పథకాలు రూపొందిస్తారు.
 
వృషభం: భాగస్వామిక చర్చల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. వృత్తులవారికి సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
మిధునం: నిత్యావసర వస్తువ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు.
 
కర్కాటకం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ వహించండి. బంధువులరాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
సింహం: మీ కార్యక్రమాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు. 
 
కన్య: దైవ కార్యాల్లో పాల్గొంటారు. వివాదస్పద విషయాలకు దూరంగా ఉండండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఆహార, ఆరోగ్యంలో మెలకువ అవసరం. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు పురోభివృద్ధి.
 
తుల: విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. సన్నిహితులను, బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు.
 
వృశ్చికం: నూతన టెండర్లు, పెట్టుబడుల విషయమై ప్రముఖులతో చర్చలు జరుపుతారు. పనులు ఆశించినంత చురుకుగా సాగకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. కొత్త వ్యక్తులతో పరిచాలేర్పడతాయి. పత్రికా సంస్థలోని ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
ధనస్సు: కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కొత్త ఆదాయమార్గాల అన్వేషణ ఫలిస్తుంది. ప్రతి విషయంలోను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మిత్రులు మీ యత్నాలకు సహకరిస్తారు. బకాయిల వసూలలో శ్రమ, ప్రయాసలెదుర్కుంటారు.
 
మకరం: పూర్వానుభావంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యావిషయాలు, విదేశీవ్యవహారాలకు ప్రోత్సాకర సమయం. కంపెనీ సమావేశాలలో మీకు గతానుభవం ఉపయోగపడుతుంది. ప్రణాళకాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాలలో లక్ష్యలు సాధిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. 
 
కుంభం: బంధువులరాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడిచోటు చేసుకుంటాయి. వస్త్రా, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. ఖర్చులు, ధన సహాయం విషయంలో మెలకువ వహించండి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
 
మీనం: ఆత్మీయులకోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ప్రముఖులను కలవడం సాధ్యం కాదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కు కుంటారని నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.