శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (21:50 IST)

ద్వాదశి పారణ సమయం.. ఉదయం 05.27 గంటలు-ఉసిరికాయను..?

ఏకాదశి వ్రతమాచరించే వారు.. తప్పకుండా ద్వాదశి పారణ చేయాలి. అప్పుడే ఏకాదశి వ్రతం సమాప్తమవుతుంది. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి రోజున ఉపవాసముండి.. ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. ఆపై ద్వాదశి రోజున (అంటే మరుసటి రోజు) సూర్యోదయానికి ముందే పారణ చేయాలి. ఆషాఢ శుక్లపక్షం, ఆషాఢ మాసానికి 11వ రోజున ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. 
 
ఈ రోజునే శయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి రోజున వ్రతమాచరించే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. అలా ఏకాదశి వ్రతమాచరించే వారు తప్పకుండా ద్వాదశి (జూలై 2)న ఉదయం 05.27 నిమిషాల్లో పారణ చేయాలి. ద్వాదశి తిథి జూలై రెండు మధ్యాహ్నం 3:16గంటలకు ముగియనుంది. 
Lights
 
తొలి ఏకాదశి రోజున పూరీ జగన్నాథ రథ యాత్ర (ఒడిస్సా) ముగుస్తుంది. శయన ఏకాదశిగా పిలిచే తొలి ఏకాదశి రోజున మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఆ రోజున మహావిష్ణువును పూజించి ఉపవసించి, జాగరణ, పారణ చేసే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

అందుకే ఏకాదశి జాగరణ ముగిశాక శుచిగా స్నానమాచరించి.. స్వామికి మహానైవేద్యం సిద్ధం చేయాలి. పానకం, వడపప్పు, ఉసిరి పచ్చడితో మహానైవేద్యం సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
Amla