సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (10:41 IST)

మంగళవారం అలా చేయకండి.. గోళ్లను స్నానానికి ముందే?

మంగళవారం పూట గోళ్లు తీయడం నిషిద్ధమని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం కూడా ఈ పని చేయకూడదని వారు అంటున్నారు. సోమ, బుధ, గురువారాలు క్షౌరం చేసుకోవచ్చు. శని ఆదివారాలు మధ్యం. మంగళవారం నాడు అస్సలు పనికిరాదు. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే గోళ్ళు కూడా తీసుకోవాలి. 
 
ఎందుకంటే గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని గోళ్లుగా పెరుగుతాయి. కాబట్టి వీటిని తొలగించాలంటే ప్రత్యేకమైన తిథులను ఎంచుకోవాలి. 
 
స్నానానికి ముందే గోళ్లను తొలగించడం మంచిది. ఇంటి బయటనే గోళ్లను తొలగించాలి. అసలు జీర్ణం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే వెంట్రుక. అలాగే గోళ్ళు కూడా. మానవుడు ఆచరించే పాపాలు అధికం జుత్తును, గోళ్లను ఆశ్రయించి ఉంటాయి. 
 
కనుక వీటిని తొలగించడానికి కొన్ని రోజులు, తిథులను అనుసరించారు. గోళ్లను ఏమాత్రం పెంచకూడదు. కనుక గోళ్ళు ఇంట్లో తీయడం దరిద్రం అని ఎందుకు అన్నారంటే దానిని తొక్కినా, అన్నంలో కలిసినా సమస్యలొస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.