అంత్యక్రియలు పూర్తయ్యాక తలంటు స్నానం చేయాలి.. ఎందుకో తెలుసా?
మానవ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి మొత్తాన్ని నీటితో శుభ్రం చేయిస్తారు. ఆపై అందరూ తలంటు స్నానం చేస్తారు. సాధారణంగా మానవ శరీరం నుంచి ఆత్మ గాలిలో కలిసిపోయాక.. ఆ మృతదేహానికి చితి పెట్టడం లేదా పూడ్చి పెట్టడం సంప్రదాయం.
మానవ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంటి మొత్తాన్ని నీటితో శుభ్రం చేయిస్తారు. ఆపై అందరూ తలంటు స్నానం
చేస్తారు. సాధారణంగా మానవ శరీరం నుంచి ఆత్మ గాలిలో కలిసిపోయాక.. ఆ మృతదేహానికి చితి పెట్టడం లేదా పూడ్చి పెట్టడం సంప్రదాయం. ఈ పనులకే అంత్యక్రియలు అని పేరు. అంత్యక్రియలు ముగిశాక తలంటు స్నానం చేయడం ప్రేతాత్మల నుంచి తమను విడిపించుకోవడం కోసమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
అయితే సైన్స్ ప్రకారం పరిశీలిస్తే.. మానవ శరీరంలో నుంచి ఆత్మ వేరయ్యాక ఆ మృతదేహం కొంచెం కొంచెంగా కుళ్ళిపోవడం మొదలవుతుంది. అంత్యక్రియల్లో పాల్గొనే వారంతా మృతదేహం పక్కనే కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు కుళ్ళిపోతూ వచ్చే భౌతిక కాయం నుంచి బ్యాక్టీరియాలు అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై ప్రభావం చూపుతాయి. అందుకే మృతదేహాన్ని శ్మశానానికి పంపించిన తర్వాత అందరూ తలంటు స్నానం చేయాలంటారు.