నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే..?
పరిమళభరితమైన పుష్పములు చేత గాని లేదా మాల చేతగాని శివలింగమును విశేషముగా అలంకరించి పూజ చేస్తారో అట్టివారు అనంత ఫలమును పొందెదరు. రుద్రాక్ష పూలతో శివుని పూజిస్తే పని లో ఎన్ని అడ్డంకులు ఉన్నా చివరకు విజయం వారిదే అవుతుంది. తుమ్మిపూలతో ఈశ్వరుని పూజిస్తే భక్తి ఎక్కువ అవుతుంది. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే సుఖ శాంతులు కలుగుతాయి
శివునికి బిల్వ పత్రములతో పూజింస్తే వారికి మూడు జన్మలలో చేసిన పాపములు పోతాయి. నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యు దోషాలు తొలగిపోతాయి. తెల్లని అన్నాంతో శివలింగాన్ని నిర్మించి దీనికి పూజలు చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
నిత్య దేవతార్చన కు పుష్పములను ధనముతో కొనుగోలు చేయుట దోషము కాదు కానీ ఇతరుల వద్ద యాచన చేసి తెచ్చినచో అది అంతయు నిష్పలమై పోవునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.