సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (22:42 IST)

సెప్టెంబర్ 24న శుక్ర గోచారం.. కన్యారాశికి, మిథునరాశికి..?

kanya rashi
సెప్టెంబర్ 24న శుక్ర గోచారం జరుగనుంది. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. శుక్రుడు సెప్టెంబర్ 24న ఉదయం 8.51 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు, తిరోగమన బుధుడు ఉండటంతో మహా కలయిక జరగనుంది. 
 
ఈ కలయిక ద్వారా కన్యారాశిలోకి శుక్ర ప్రవేశం ఉంటుంది. కన్యారాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశించడతో ఈ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. గౌరవం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశం కనిపిస్తుంది. 
 
మిథున రాశి వారికి అదృష్టం వరించే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం విపరీతంగా పెరగనుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి మంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చేకాలం. ధనాదాయం వుంటుంది. 
 
కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ గెలుస్తారు. దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.