ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (15:00 IST)

నలుపు శునకాలకు రొట్టెలను తినిపిస్తే?

Black Dogs
Black Dogs
నలుపు శునకాలకు రొట్టెలు ఇవ్వడం ద్వారా భైరవుని కృప కలుగుతుంది. కాకులకు బియ్యం వేయడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. 
 
శుక్రవారం సాయంత్రం చిన్న పసుపు కొమ్ము తీసుకుని శ్రీ సూక్తం 16సార్లు చదివి పూజించి స్త్రీలు పర్సులో పెట్టడం ద్వారా సంపదలు కలుగుతాయి. 
 
సర్పదోషము వున్నవారు రాహుకేతువులను కాకుండా సర్పాలను పూజించండి. పుట్టకు పాలు పోయడం వంటివి చేయొచ్చు. శనివారం నల్ల శెనగలను ఆహారంలో చేర్చడం చేయొచ్చు. 
 
మీ వంట పూర్తయిన తర్వాత మొదటి ముద్ద ఆవుకి, కుక్కకి లేదా కాకులకు తీసి పక్కనబెట్టిండి. నిద్రలేవగానే రెండు అరచేతులను కాసేపు చూసి మీ ముఖాన్ని రుద్దండి. సువాసినులు వీలైనంత వరకు ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి. 
 
వంటగదిని వీలైనంత వరకు ఆగ్నేయం లేదా వాయవ్యంలో కట్టండి. వాయవ్య గోడకు ఆనుకుని తగిలి మెట్లు లేదా టాయ్‌లెట్లు కడితే ఇక్కట్లు తప్పవు. ఈశాన్యంలో మెట్లు లేదా బరువైన కట్టడం వుంటే వాటికంటే లేదా పక్కన 1 పీటు గొయ్యి తీసి దాంట్లో కూర్మా యంత్రాన్ని వుంచి నీటితో నింపండి.