బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (15:13 IST)

మల్లెపువ్వులను స్నానానికి ముందు ధరించాలా?

Jasmine
మహిళలు తలలో పువ్వులను ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ఈ కథనం చదివితే కనుక మహిళలు ఇక రోజూ పుష్పాలను ధరించడం ఆపరు. ప్రపంచ వ్యాప్తంగా 38వేలకు పైగా పువ్వుల్లో రకాలున్నాయి.

అయితే ప్రస్తుతం వెయ్యికి పైబడిన రకాలే వాడుకలో వున్నాయి. ఇందులో 500 కోట్ల పువ్వులు ఔషధ గుణాలకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ పువ్వులను మహిళలు సిగలో ధరించేటప్పుడు కొన్ని గంటలే వాడాలి. ముల్లలు -18 గంటలు, రోజా పువ్వులను రెండు రోజులు, మల్లె పువ్వులు అరపూట మాత్రమే వాడాలి. 
 
పువ్వులను సిగలో ధరించడం ద్వారా ఏర్పడే ప్రయోజనాలు
రోజా పువ్వులు- తల తిరగడం, కంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
మల్లెలు - మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. కంటికి మేలు చేస్తుంది. 
సంపంగి- వాతాన్ని నయం చేస్తుంది. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది.
తామర పువ్వు - తల రుగ్మతలు, తల తిరుగుడు నయం అవుతుంది. 
కనకంబరాలు - తలనొప్పి తొలగిపోతుంది. 
 
పువ్వులను ఎలా ధరించాలి:
పువ్వులను మెడ ప్రాంతంలో వేలాడేలా ధరించకూడదు. వాసనతో కూడిన పువ్వులను వాసన లేని పువ్వులతో చేర్చి ధరించకూడదు. ఇలా చేస్తే జుట్టు పెరగదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. జాజిపువ్వులు, మల్లెలు, సంపంగి, రోజా పువ్వులు వంటివి కనకంబరాలతో కలిపి ధరించడం మంచిది. తామర, మందారం కర్పూరంతో కలిపి ధరించడంతో మంచిది. అలాగే మల్లెపువ్వులను స్నానానికి ముందు ధరించడం చేయాలి. బిల్వపువ్వులు, జాజిపువ్వులను స్నానానికి అనంతరం ధరించడాలి. శరీరానికి నూనె పట్టించేటప్పుడు సంపంగి పువ్వులను ధరించవచ్చు. 
 
పువ్వులను ధరించడం ద్వారా వాటిలోని ప్రాణవాయువు మెదడు సెల్స్‌ను ఉత్తేజపరుస్తుంది. 
పువ్వుల్లోని ఈ ప్రాణవాయువు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆందోళనలకు చెక్ పెడుతుంది. మెదడును మెరుగ్గా పనిచేసేలా చూస్తుంది. ఒక విషయాన్ని పలు కోణాల్లో ఆలోచించే సామర్థ్యాన్నిస్తుంది. పువ్వుల్లోని సువాసన శరీరంలోని కణాలకు కూడా ఉత్సాహాన్నిస్తుంది. మానసిక మార్పు ఏర్పడుతుంది. సంతోషాన్నిస్తుంది.
 
పువ్వుల భాష చాలా పురాతనమైనది. భారతదేశంలోని ప్రతి సంస్కృతి ఈ పువ్వులు, మహిళలకు భిన్నమైన అర్థాన్ని కలిగి ఉంది. భారతదేశంలో, ఒక అమ్మాయి తన జుట్టుకు పువ్వులు ధరించాలి ఎందుకంటే ఇది కుటుంబానికి ఆనందాన్ని మరియు సభ్యులందరికీ శ్రేయస్సును ఇస్తుంది. ఇంకా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని, సంపద ఎప్పటికీ ఇంటిని విడిచిపెట్టదని గుర్తు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.