బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

అత్తాకోడళ్ల జగడానికి అడ్డుకట్ట వేయాలంటే.. శనివారం ఇలా..?

శనివారం రోజు నల్లని శునకాన్ని చూసినట్లయితే మంచి జరగబోతుందని విశ్వాసం. అంతేకాకుండా వాటికి ఆహారం అందించాలి. ఆవనూనెతో తయారు చేసిన రొట్టెను శనివారం నల్లటి శునకానికి ఆహారంగా ఇస్తే ఇంకా మంచి జరుగుతుంది. సమయానికి ఇంట్లో రొట్టే సిద్ధంగా లేకపోయినట్లయితే బిస్కెట్లను అందించినా సరిపోతుంది. శనివారం ఉదయాన్నే ఎవరైన వ్యక్తులు భిక్షాటన చేస్తూ ఇంటికి వస్తే చాలా మంది విసుక్కుంటారు. ఈ విధానం సరికాదు. దీన్ని శుభంగా పరిగణించాలి. 
 
అందులోనూ శనివారం ఉదయాన్నే ఎవరైనా యాచకులు ఇంటికి వస్తే త్వరలో అదృష్టం రానున్నట్లు భావించాలి. ఒకవేళ యాచకులు మీ ఇంటికి రాకపోయినా.. ఉదయాన్నే వారిని చూసినా శుభం కలుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారికి తగిన సాయం చేయాలి. ఫలితంగా శనిదేవుడి అనుగ్రహం పొంది ఎల్లవేళలా సమస్యలు రాకుండా రక్షణగా ఉంటాడు.
 
న్యాయానికి భగవత్ స్వరూపమైన శనీశ్వరుడు ఎప్పుడూ ప్రజలకు హాని చేయాలని అనుకోడు. అయితే శని చెడు ప్రభావం సోకితే మాత్రం ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశముంది. అందుకే శనివారం భక్తిశ్రద్ధలతో శనిదేవునిని కొలిస్తే ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. అలాగే శనిదోషాలు తొలగిపోవాలంటే.. నల్లటి శునకంతో పాటు నల్లని గేదె, నల్లటి ఆవుకు ఆహారం ఇవ్వడం చేయాలి. 
 
అలాగే శని వారం పూట ఆవుకు చపాతీలను ఇవ్వడం చేయాలి. ఇంట్లో ఆనందం కోసం తయారుచేసిన మొదటి చపాతిని ఆవుకు, చివరి చపాతిని కుక్కకు ఇవ్వడం చేయాలి. అత్తకోడళ్లకు తరచూ గొడవలు ఎదురైతే.. మీ అత్తగారి పేరును ఆ చపాతీపై నల్ల సిరాతో రాసి, శనివారం సాయంత్రం ఆ చపాతిని నల్ల కుక్కకు తినిపించండి. ఇది అత్తాకోడళ్ల పోరాటానికి తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
 
అలాగే చపాతీలను తయారు చేసి దానిపై పితృదేవతల పేర్లను రాసి శనివారం పూట పాయసంతో కలిపి కాకికి ఇవ్వడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. చపాతీలను తయారు చేసి.. వాటితో పాటు పంచదారను కలిపి చీమలకు ఆహారంగా ఇస్తే.. అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.