1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (07:20 IST)

శనివారం శ్రీవారికి ఎందుకు ప్రత్యేకం.. ఏడు వారాలు ఆయన్ని దర్శించుకుంటే? (video)

ఏయే వారాలు ఏ దేవునిని పూజిస్తే ఫలితం వుంటుందో పురాణాల్లో పేర్కొనబడివుంది. ఆదివారం సూర్యభగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రమణ్యస్వామి, ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్పస్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం శ్రీ వేకటేశ్వర స్వామికి ప్రత్యేకం. శ్రీవారికి శనివారం ఎంతో ప్రీతికరం. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం తిరుమలేశుడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆయనే. అందుకే ప్రతీ భక్తుడు శనివారం ఆయనను స్మరించుకుంటారు. వీలైతే తిరుమలకు వెళ్లి దర్శించుకుంటారు.
 
ఇంతకీ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం అనేది తెలుసుకోవాలంటే..? ఈ కథనంలోకి వెళ్ళాల్సిందే. శ్రీవారు స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని వరుసగా ఏడు వారాలు దర్శించుకోవడం ద్వారా భక్తుల కోర్కెలు నెరవేరుతాయి. ప్రారంభించే శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామీ వారికి నివేదించుకొని ఏడు ప్రదక్షిణములు చేయాలి. తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. 
venkateswara swamy
 
స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా స్వామిని దర్శించుకోవడం చేయొచ్చు.  ఏడు శనివారం స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత.. శ్రీవారి ఆలయంలో అన్నదానానికి బియ్యం, పప్పులు, నూనెలు, ఏదైనా గాని భక్తుని స్తోమతను బట్టి ఏడు కుంచాలు, ఏడు కేజీలు, ఏడు గుప్పెళ్ళు గాని సమర్పించుకోవచ్చు. 
 
సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తారు. వేంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావడం, శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటి సారి దర్శించిన రోజు శనివారం కావడం, ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాను చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావడంతో వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది. 
lord venkateswara
 
అందుకే శనివారం పూట శ్రీవారిని దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అంతేగాకుండా.. శ్రీ వేంకటేశ్వ స్వామికి శనివారం దర్శించుకోలేని వారు.. ఇంటిపట్టునే ఆయనను స్మరించి పూజలు చేసుకున్నా శుభఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.