గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మే 2024 (19:48 IST)

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Guru Bhagavan
వివాహిక జీవితం, విద్య, జ్ఞానం, సంతానం, ధనాదాయం కోసం గురువుని స్తుతించాలి. మే 1వ తేదీన గురు పరివర్తనం జరిగింది. మేషం: ప్రస్తుతం గురుభగవానుడు మేషరాశిలో వున్నారు. తద్వారా మేషరాశి వారికి విజయం చేకూరుతుంది. లాభాలు వుంటాయి. ధనాదాయం చేకూరుతుంది. 
 
వృషభం: వృషభరాశిలో గురుపరివర్తనం జరిగింది. తద్వారా వృషభ రాశి జాతకులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. వ్యాపారాభివృద్ధి, పదోన్నతి చేకూరుతుంది. ఉన్నతస్థాయికి చేరుకుంటారు. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
 
మిథునం: మిథునరాశికి కొన్ని చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం వుంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి వుంటుంది. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకరాశి : కర్కాటక రాశి వారికి శుభవార్తలుంటాయి. సంతానంతో శుభవార్తలు వింటాయి. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. పదోన్నతి చేకూరుతుంది. 
 
సింహం: ఈ రాశి జాతకులకు లాభదాయకంగా వుంటుంది. వ్యాపారాభివృద్ధి వుంటుంది. అధికలాభం ఏర్పడుతుంది. కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి. సుఖసంతోషం చేకూరుతుంది. 
 
కన్యారాశి: గురుపరివర్తనం కారణంగా కన్యారాశి జాతకులకు శుభవార్తలు వింటారు. ఇన్ని రోజుల పాటు అడ్డంకులు తొలగిపోతాయి. విజయాలు చేకూరుతాయి. ఆరోగ్యానికి బలం చేకూరుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకూలతలున్నాయి.
 
తులాం: తులారాశిలో జన్మించిన జాతకులకు అన్నీ అనుకూలతలు వుంటాయి. పదోన్నతి చేకూరుతుంది. కుటుంబంలో ఐక్యత, సుఖసంతోషాలు చేకూరుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమ, అభిమానం పెంపొందుతాయి. 
 
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసివచ్చింది. అన్నీ కార్యాల్లో విజయాలు చేకూరుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి.
 
ధనుస్సు : గుర్తు పరివర్తనం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు శుభఫలితాలున్నాయి. కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
మకరం: మకరరాశి జాతకులకు గురుపరివర్తనంతో మంచి జరుగుతుంది. ఉన్నత పదవులను అలంకరిస్తారు. పై అధికారులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధి వుంటుంది. 
 
కుంభం : కుంభరాశి జాతకులకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పొట్ట సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి వుంటుంది. ఆర్థిక ఇబ్బందులు వుండవు. 
 
మీనం: గురు పరివర్తనం కారణంగా మీన రాశి జాతకులకు మేలు జరుగుతుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగం వరిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి.