శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By PNR
Last Updated : గురువారం, 3 జులై 2014 (13:18 IST)

ప్రయాణం చేయబోతున్నారా.. అయితే ఇవి పాటించండి!!

చాలా మంది ఎలాంటి ముదస్తు ప్రణాళిక లేకుండా దూరపు ప్రయాణాలకు శ్రీకారు చుడుతుంటారు. మరికొందరు వారం, వర్జ్యం, తిథి, నక్షత్రం, రోజు, తేదీలను చూసుకుని బయలుదేరుతారు. అయితే, దూర ప్రయాణాలు చేయదలచిన వారు మంచి చెడులను చూసుకుని వెళ్లాలని మన పెద్దలు చెపుతుంటారు. ఇందుకోసం కొన్ని తిథులు, వారాలు కూడా వారు గుర్తించారు. 
 
ఆ ప్రకారంగా సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదాలని జ్యోతిష్కులు అంటున్నారు. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలు దేరటం శ్రేయస్కరమని సలహా ఇస్తున్నారు. 
 
అదేవిధంగా శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదనీ, గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదనీ, భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదని సూచిస్తున్నారు. 
 
ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణలు అంటున్నారు. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదని జ్యోతిష్య శాస్తం చెబుతోంది. 
 
అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందుచేత ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.