1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:09 IST)

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

ganesh
ధనం రాబడి కోసం, ఆదాయం పెరగడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. శుక్రవారంలో వచ్చే శుక్ర హోర సమయంలో లేదా ఏ రోజైనా ఆ రోజులో వచ్చే శుక్రహోరలో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లాలి. ఆలయంలో రావిచెట్టు వుండేలా చూసుకోవాలి. 
 
రావిచెట్టు కింద తప్పకుండా విఘ్నేశ్వరుడి విగ్రహం వుంటే ఆ విగ్రహంతో పాటు రావి చెట్టును 108 సార్లు శుక్ర హోరలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షణలు చేసే సమయంలో "ఓం లక్ష్మీ గణపతియే నమో నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షణలు చేయాలి. 
 
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9 గంటలను శుక్రహోరగా పరిగణిస్తారు. ఈ శుక్రహోరలో శుక్రవారం రావిచెట్టు కింద కొలువైన వినాయకుడిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ధనాదాయం వుంటుంది. సర్వశుభాలు సిద్ధిస్తాయి. 
Peepal Tree
Peepal Tree
 
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7 గంటల సమయంలో వినాయకుడిని 108 సార్లు ప్రదక్షణలు చేయడం అలాగే శనివారం (20-04-2024) మధ్యాహ్నం 12-1 గంట లోపు వినాయకుడిని ప్రదక్షణలు చేసి.. 16 నెయ్యి దీపాలను వెలిగించి.. పై మంత్రాన్ని పఠించడం ద్వారా కచ్చితంగా ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, ధాన్యాలకు కొదవ వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.