బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (22:24 IST)

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

weekly astro
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆదాయం అంతంత మాత్రమే. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. సోమవారం నాడు ఇతరుల విషయంలో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. నిర్దిష్ట ప్రణాళికలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. బుధవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. దైవ, సామాజిక కార్య క్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ఆది, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొంతమంది మీ నుంచి విషయసేకరణకు యత్నిస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానంపై చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయ, ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికుల ఆదాయం బాగుంటుంది. ప్రయాణం తలపెడతారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అభీష్టసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. సాయం ఆశించవద్దు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. గురువారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనంమితంగా వ్యయం చేయండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారులకు పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఆశాజనకం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం ప్రతికూలతలు అధికం. చిన్న విషయమే సమస్యాత్మకమవుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారంచుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలతో తలమునకలవుతారు. పనిభారం, అకాలభోజనం. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. పట్టుదలకు పోవద్దు. సౌమ్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. సభలు, కీలక చర్చల్లో పాల్గొంటారు. దూరప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. శుక్ర, శనివారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. ఉపాధి పథకాలు ప్రోత్సహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఖర్చులు అధికం. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఏ విషయానికీ అతిగా స్పందించవద్దు. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కొత్త పరిచయాలేర్పడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. వ్యవహారాలతో తలమునకలవుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. మంగళవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. అవివాహితులకు శుభయోగం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులు ఏకభిప్రాయానికి వస్తారు. గృహ ఆలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త చిక్కులు ఎదురవుతాయ. చేతివృత్తులు, కార్మికుల ఆదాయం బాగుంటుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధైర్యంగా అడుగు ముందుకేయండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి ఫలిస్తుంది. వ్యతిరేకించిన వారే మీ సామర్ధ్యాన్ని గుర్తిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. బుధ, గురువారాల్లో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. అవకాశాలను దక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. గృహనిర్మాణాలు, మరమ్మతులు ముగుస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సోదరీ సోదరుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు అంకితభావం ప్రధానం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. శనివారం నాడు ప్రతి విషయాలోను ఆచితూచి అడుగేయాలి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వాస్తుదోష నివారణ చర్యల ఫలితాలు త్వరలో కనిపిస్తాయి. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు పనిభారం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి కష్టసమయం. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతిలోపం.