1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (14:05 IST)

07-04-2024 నుంచి 13-04-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంప్రదింపులు ముందుకు సాగవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనుల్లో ఒత్తిడి. చికాకులు అధికం. మంగళవారం నాడు అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులకు మీ సమస్యలను తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ఒత్తిడి అధికం. చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ నమ్మకం, కృషి ఫలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. ఆది, గురువారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. మీ అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ జీవితభాగస్వామి సలహా తీసుకోండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. శనివారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. కన్సల్టెన్సీలు, మధ్యవర్తులను నమ్మవద్దు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. మంగళ, బుధవారాల్లో పనులు ఒక పట్టాన పూర్తి కావు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. అతిగా ఆలోచింపవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఇంటి విషయాలు పట్టించుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు కలిసిరావు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు నిరాశాజనకం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఆదాయం సామాన్యం. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ఉన్నతాధికారులకు పనిభారం. ఉపాధ్యాయులు మానసికంగా స్థిమితపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అనివార్యమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంప్రదింపులకు అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. గురువారం నాడు అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కకరం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ప్రారంభించిన పనులు ఆపివేయవద్దు. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం తగదు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆదివారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పందాలు, బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. న్యాయ, వైద్య రంగాల వారి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆది, సోమవారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ప్రముఖులకు మరింత చేరువవుతారు. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలకు సన్నాహాలు సాగిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుంది. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పొదుపునకు ఆస్కారం లేదు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మంగళవారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. అయినవారి మధ్య కొత్త విషయాలకు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పాతమిత్రుతో సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు ఆందోళన అధికం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం శుభయోగం. యత్నాలు ఫలిస్తాయి. వాక్చాతుర్యంతో ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ధనలాభం, వస్తుప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనం. ఆపన్నులను ఆదుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పనులు ప్రారంభంలో స్వల్ప ఆటంకాలెదురవుతాయి. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. మీ జీవితభాగస్వామి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు మనోధైర్యం, ఏకాగ్రత ప్రధానం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.