బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (20:03 IST)

24-03- 2024 నుంచి 30-03-2024 వరకు మీ వార రాశిఫలాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలం. కృషి ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అడియాశకు పోతే నష్టాలు తప్పవు. వ్యవహార పరిజ్ఞానం ఉన్న వారి సలహా పాటించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. మంగళవారం నాడు మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. పనులు అనుకున్న విధంగా పూర్తిచేయగల్గుతారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. గృహమరమ్మతులు, నిర్మాణాలు ముగింపు దశకు వస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుకకు ముహుర్తం ఖరారవుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం ఉపాధి పథకాలు చేపడతారు. ప్రయాణం లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ శ్రీమతి ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. దళారులను నమ్మవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వైద్య, ఆరోగ్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులు పరీక్షలు బాగా రాయగల్గుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలం. మీ కృషి ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ ఉన్నతిని చాటుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. బుధవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అవివాహితులకు శుభయోగం. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు ఊహించని సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. విమర్శలు పట్టించుకోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఆత్మస్థైర్యంతో యత్నాలుసాగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆదివారం నాడు ఊహించని ఖర్చులుంటాయి. సాయం అర్ధించి భంగపాటుకు గురవుతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆప్తుల కలయిక ఊరటనిస్తుంది. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు విపరీతం. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. బుధవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. కీలకపత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్టసమయం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. సంప్రదింపులకు అనుకూలం. ఒప్పందాల్లో ఆచితూచి అడుగువేయండి. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. గురువారం నాడు అపరిచితులతో మితంగా సంభాషించండి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఆడిటర్లు, న్యావాదులకు ఆదాయాభివృద్ధి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం దూకుడు అదుపుచేయండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పన్ను చెల్లింపులు అలక్ష్యం చేయొద్దు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమస్యలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ చిత్తశుద్ధికి ప్రశసంలు లభిస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఏకాగ్రత, కృషి ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆత్మీయుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అపరిచితులను నమ్మవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. వ్యతిరేకులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆశించిన వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దైవదర్శనాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆది, శనివారాల్లో ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. అతిగా శ్రమించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యంలో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ప్రతి విషయంలోను అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఒంటెద్దు పోకడ వల్ల ఇబ్బందులు తప్పవు. కీలక సమాచారాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సోమవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య చీటికిమాటికి తగవులు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆప్తుల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలు నెలకొంటాయి. శక్తిసామర్థాలను చాటుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. రుణసమస్యలు కొలిక్కివస్తాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వేస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బుధ, గురువారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆప్తుల సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.