గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (20:02 IST)

25-02- 2024 నుంచి 02-03-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదివారం నాడు కొత్త సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రయాణం తలపెడతారు. 
 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. మంగళ, బుధవారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఒక సమాచారం ఆలోచించేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రశాంతత, దాంపత్య సౌఖ్యం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నాడు పనులు సాగవు. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. శుక్ర, శనివారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. బంధువులతో విభేదాలు, దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆలోచనలతో సతమతమవుతారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయమాన్న వెలితి వెన్నాడుతుంది. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగి విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సంతానం చదువులపై దృష్టి సారించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయ, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. బుధవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. వేడుకను ఘనంగా చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహమార్పు అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు హోదామార్పు. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహనిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. గురు, శుక్రవారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీబాగుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొన్నివిషయాల్లో జోక్యం అనివార్యం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలను ఓ కంట కనిపెట్టండి. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. అధికారుల తీరును గమనించి మెలగండి. నిరుద్యోగులకు శుభయోగం. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మిత సంభాషణ శ్రేయస్కరం. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. గృహనిర్మాణానికి అనుమతులు మంజూరవుతాయి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం. దూర ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రలతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పిల్లల చదువులపై దృష్టి సారించండి. శనివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పెట్టుబడులు కలిసిరావు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సామర్యంగా మెలగండి. పెద్దల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. ఆదివారం నాడు పనులు సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్ సేల్ వ్యాపారులు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల ఆహ్వానం సంతోషపరుస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఓర్పు ప్రధానం. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త.