గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (20:03 IST)

18-02- 2024 నుంచి 24-02-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పిల్లల చదువులు పట్టించుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆరోగ్యం బాగుంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన అవకాశం దక్కదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆది, సోమవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పనులు చురుకుగా సాగుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభాలకు లొంగవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మొండిబాకీలు వసూలవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాహనసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పాత మిత్రులు తారసపడతారు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆదరణ ఆకట్టుకుంటుంది. ప్రైవేట్ సంస్థల వారికి ఓర్పు ప్రధానం. అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలుంటాయి. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వాయిదాపడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. బంధుమిత్రులతో విభేదిస్తారు. ఆదాయం సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. శనివారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితుల్లో నిదానంగా మార్పు వస్తుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరిచయస్తుల వ్యాఖ్యలు బాధిస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులుంటాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యవహారజయం, ధనలాభం పొందుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకులలో ఒకరి ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు, పనులు ముందుకు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. మీ పథకాలు, సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. వాక్యాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. పాతపరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు శుభయోగం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంతోషకరమైన వార్తలు వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కీలక పత్రాలు సమయానికి కనిపించవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతి విషయంలోను ధైర్యంగా ఉంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆది, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. బుధవారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో సంభాషణ మనశ్శాంతినిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడిగా కంటె సొంత వ్యాపారాలే అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. విదేశీ ప్రయాణాలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. గురు, శుక్రవారాల్లో కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం దూడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. లక్ష్యం సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. గృహమార్పు అనివార్యం. అవివాహితులకు శుభయోగం. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు స్థానచలనం. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి.