గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (17:43 IST)

11-02- 2024 నుంచి 17-02-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు ఫోను సందేశాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో సమస్యలు ఎదురవుతాయి. సామరస్యంగా మెలగండి. ఎవరిని తప్పుపట్టవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం జాగ్రత్త, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. క్యాటరింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. గురు, శుక్రవారాల్లో కొత్తవారితో జాగ్రత్త. పొగిడే వ్యక్తులను నమ్మవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి, గృహంలో సందడి నెలకొంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిలర్ల ఆదాయం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం ఆశాజనకం. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యమంగా మెలగండి. విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం అంచవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ధనసమస్యలు ఎదురవుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మనోబలం ముఖ్యం. యత్నాలు కొనసాగించండి. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలోచనలతో సతమతమవుతారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరు కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. అవివాహితుల మధ్య అవగాహన నెలకొంటుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ది. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ కలుపుగోలుతనం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంటుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. మంగళవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. న్యాయ, వైద్య, ఆడిట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆది, గురువారాల్లో అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూల సమయం. అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. విదేశీ సందర్శనలకు పాప్ పోర్టులు మంజూరవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బుధవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య, కుటుంబ సౌఖ్యాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. గురువారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. వేడుకకు హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయానికీ కుంగిపోవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుక్ర, శనివారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంతోషకరమైన వార్తలు వింటారు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆది, సోమవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడిగా కొంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం.