గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (19:32 IST)

17-03-2024 నుంచి 23-03-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా కొంతమేరకు బాగుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితాన్నీయవు. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పరిచస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సోమవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించంచండి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదామార్పు, అదనపు బాధ్యతలు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. బుధవారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు లక్ష్యాలను సాధిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆడిటర్లు, అక్కౌంటెంట్లకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభయోగం. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహార లావాదేవీల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం ఉత్తమం. పెట్టుబడులకు తరుణం కాదు. సంతానం చదువులపై శ్రద్ధవహించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనలో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవివాహితులకు శుభయోగం. గృహమార్పు కలిసివస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీంచుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఆప్తుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సోమ, మంగళవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కులుగకుండా మెలగండి. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు అనివార్యం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అధికారులు తీరు కష్టమనిపిస్తుంది. ఉపాధి పథకాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం గ్రహాల సంచారం అనుకూలం. పరిస్థితులు మెరుగుపడతాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. ఓర్పుతో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా ముగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిస్వార్ధంగా చేసిన ఉపకారానికి ప్రశంసలందుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభవార్తలు వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహాలంకరణ పట్ల మక్కువ పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ధనప్రలోభాలకు లొంగవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అసూయ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. బుధవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. కీలక పత్రాలు అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి విపరీతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధ్యాయులకు క్లిష్టసమయం. విద్యార్థులు ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్ధివర్గాల వారితో జాగ్రత్త. ఆది, గురువారాల్లో అనవసర విషయాల జోలికి పోవద్దు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పాతమిత్రులు తారసపడతారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఖర్చులు సామాన్యం. ఆపన్నులకు సాయం అందిస్తారు. నిలిపివేసిన పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధవహిస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. శుక్రవారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ధనయోగం. ఉపాధ్యాయులకు పనిభారం. విద్యార్థుల్లో ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వస్తులాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు సామ్యాం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదురకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. నిరుద్యోగులకు అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కష్టసమయం. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సంకల్పబలమే మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. ఆది, సోమవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అక్కౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.